హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 25 : తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో నవంబర్ 8, 9న రాష్ర్టస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు. ఈ పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ దగ్గరగల టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు, ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు నగదు పురస్కారంతోపాటు, ప్రశంసాపత్రాలు, వ్యక్తిగత మెడల్స్, ట్రోఫీలను, కూడా బహుకరిస్తారని తెలిపారు. క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు నవంబర్ 6వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు నిర్వహణ కార్యదర్శి కన్నా 90595 22986 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.