హనుమకొండ చౌరస్తా, జూన్ 7 : హనుమకొండలోని జేఎన్ఎస్లో జరిగిన 10వ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది. బాయ్స్ అండర్-18 విభాగంలో హనుమకొండ, అమ్మాయిల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం, మెన్స్ విభాగంలో కరీంనగర్, ఉమెన్స్ విభాగంలో ఖమ్మం దకించుకున్నాయి. పోటీల ముగింపు సమావేశానికి ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జూనియర్స్ ఇండియన్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరదరాజేశ్వరరావు, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీజోన్స్, డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ నాయక్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగబాబు హాజరయ్యారు.
యూత్ విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 15 నుంచి జరిగే పోటీల్లో పాల్గొంటారు, మెన్, ఉమెన్ విభాగంలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి హర్యానాలోని పంచకులలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కొదరుపాక సారంగపాణి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆర్థిక సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు మెడల్స్‌తో పాటు బహుమతులు అందజేసి అభినందించారు. పోటీల్లో 32 జిల్లాల నుంచి 971 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు 60 మంది టెక్నికల్ అఫీషియల్స్ 30 మంది అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.