హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11 : ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో సంతకాలు పెట్టి వెళ్లిన వైద్యులపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్ అయ్యారు. వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి గైర్హాజరైన, సెలువులో ఉన్నవారి వివరాలను సూపరింటెండెంట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ‘సంతకాలు పెట్టిన వైద్యులందరూ ఉన్నారా.. వచ్చారా..? లేకుంటే సంతకాలు పెట్టి వెళ్లారా? అని ఒక్కొక్క వైద్యురాలి పేరు చదివారు. డాక్టర్ భవాని కనిపించకపోవడంతో ఆరా తీశారు. అక్కడే ఉన్న ఆర్ఎంవో అంబరీష్ ఆమెకు ఫోన్ చేయగా 10 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చారు. కొందరు సెలవులో ఉన్నారని, మరికొందరు కేఎంసీకి వెళ్లారని ఇలా సూపరింటెండెంట్ సమాధానం చెప్పడం విశేషం. ఆర్వీ కర్ణన్ సోమవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖానను తనిఖీ చేశారు. ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్‌నాయక్ ఆదేశాలతో దవాఖానను తనిఖీ చేస్తారనే విషయం తెలుసుకున్న వైద్యులందరూ విధులకు హాజరయ్యారు. డీఎంహెచ్‌వో వస్తారనుకునే సమయానికి ఆర్వీ కర్ణన్ రావడంతో వైద్యవర్గాల్లో గుబులు మొదలైంది. డీఎంహెచ్‌వో అప్పయ్య, పీవోడీటీటీ లలితాదేవి, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి, ఆర్ఎంవో అంబరీష్‌తో కలిసి ఆయన జీఎంహెచ్‌ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఇంకా ఎకువగా ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సానింగ్ సెంటర్లో రోజుకు ఎన్ని టిఫా, గైనిక్ సాన్లు చేస్తున్నది తెలుసుకొని వివరాలను టీ డయాగ్నస్టిక్ హబ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం లేబర్‌రూం, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, ల్యాబ్, వార్డు, నవజాత శిశువు సంరక్షణ కేంద్రం, మిల్బ్యాంకు, ఐసీటీసీ సెంటర్లను సందర్శించారు. గైనకాలజిస్టులు, అనస్తీషియన్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారని, ప్రతిరోజు ప్రసవాలు, ఇతర ఆపరేషన్లు ఎన్ని జరుగుతున్నాయో తెలుసుకున్నారు. వార్డులను సందర్శించి బాలింతలతో మాట్లాడారు. ప్రతి గర్భిణి పీహెచ్సీ నుంచి జీఎంహెచ్‌కు 3వ, 4వ చెకప్ పరీక్షకు వచ్చేలా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు చూడాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.
వరంగల్ చౌరస్తా : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్వీ కర్ణన్ వైద్యులకు సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్యాధికారులతో కలిసి ఆయన సోమవారం వరంగల్ సీకేఎం హాస్పిటల్‌ను సందర్శించారు. నవజాత శిశువుల వార్డు, లేబర్ రూం (కాన్పుల గది)లో అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో పీజీ డాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇన్స్టిట్యూషనల్ డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. మాత, శిశు మరణాలు లేకుండా చూడాలని సూచించారు. సమస్యలను ఎప్పటికప్పుడు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి పరిష్కరించుకోవాలన్నారు. దవాఖాన ఆవరణలో పరిశుభ్రత లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వరంగల్ డీఎంహెచ్‌వో సాంబశివరావు, అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్వోలు ప్రకాశ్, మోహన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.