పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం వరంగల్‌లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. శరవేగంగా 80 శాతానికి పైగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసింది. అవసరమైన యంత్రాలు, పరికరాలు బిగించి 2023 నవంబర్ చివరి వరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఈలోగా ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. హాస్పిటల్‌లోని అంతర్గత, తుది పనుల పూర్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవసరమైన రూ. 300 కోట్లు విడుదల చేయకుండా రాష్ట్ర సర్కారు కొర్రీలు పెడుతున్నది.
నిర్మాణ వ్యయం పెరిగిందనే సాకు చూపుతూ విచారణ పేరిట కుట్రలు చేస్తున్నది. నిధుల కేటాయింపునకు మంత్రివర్గ ఆమోదం కావాలంటూ పనులకు ఆటంకం కలిగిస్తున్నది. మంత్రివర్గ సమావేశాలు జరిగినా నిధుల సంగతి తేల్చకుండా వాయిదాలు వేస్తున్నది. ఇటీవలి సమావేశంలోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దాటవేసింది. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. దీంతో నత్తే నయం అనిపించేలా నిర్మాణ సంస్థ తన పనిచేస్తూ పోతున్నది.
పేదలకు కార్పొరేట్ వైద్య సేవలందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ న గరంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హా స్పిటల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. భవన నిర్మాణ కోసం అవసరమైన నిధుల కేటాయింపు ప్రక్రియపై కొర్రీలు పెడుతూ పనులు పూర్తి కా కుండా కుట్రలు చేస్తున్నది. మిగిలిన కీలక ప్రాజెక్టులకు అమలు చేసిన విచారణ కు ట్రలను ముందుకు తెచ్చి వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణం పూర్తి చేయకుండా వ్యవహరిస్తున్నది.
24 అంతస్తుల భవనం నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయ్యింది. భవనంలోని అంతర్గత, తుది పనులను పూర్తి చే యడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సూపర్ స్పెషాలిటీ హా స్పిటల్ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమైన రూ.300 కోట్ల నిధులు విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సాకు లు చెబుతూ వాయిదాలు వేస్తున్నది. భవ న నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమో దం కావాలంటూ పనులకు అడ్డంకు లు కల్పిస్తున్నది. నిధు ల కేటాయింపు పై స్పష్టత రాకపోవడంతో సూపర్ స్పెషాలిటీ హా స్పిటల్ నిర్మాణం పూర్తిపై అయోమయం కొనసాగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన కొది పనులను పూర్తి చేయకుండా కాంగ్రె స్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది.
దేశంలోనే పెద్ద దవాఖాన
ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు దీటుగా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేలా వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రణాళికను కేసీఆర్ ప్రభుత్వం రూపొందించింది. 35 విభాగాలు, వీటిలో 77 యూనిట్ల వారీగా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేలా డిజైన్ ఉన్నది. గుండె, కాలేయం మార్పిడి, క్యాన్సర్‌ను నయం చేసే కీమోథెరపీ, రేడియేషన్‌తో పాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించేలా నిర్మాణం ఉండనున్నది.
పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక ఉన్నది. సూపర్ స్పెషాలిటీ బెడ్లకు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉండేలా నిర్మాణ సమయంలోనే ఏర్పాట్లు చేయనున్నారు. అవయవాల మార్పిడి, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్, సర్జికల్, మెడికల్, ఐసీయూ విభాగాలు ప్రత్యేకంగా ఉంటాయి. 500 మంది డాక్టర్లు, వెయ్యి మంది నర్సులు, మరో వెయ్యి మంది పారామెడికల్, ఇతర సిబ్బంది పనిచేయనున్నారు. శస్త్ర చికిత్సలు, అత్యవసర సేవల కోసం సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్ ఉంటుంది. మొత్తంగా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఉండేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పనులు పూర్తి చేయకుండా చోద్యం చూస్తున్నది.
మొదలు కాని పరికరాల బిగింపు..
సీఎం రేవంత్‌రెడ్డి 2024 జూన్ 29న వరంగల్‌కు వచ్చి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ అంచనాలు పెరిగాయని ఆరోపించి విచారణ చేయనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి పనులు పూర్తి చేయడంలో సందిగ్ధత కొనసాగుతున్నది. ఆస్పత్రిలో వైద్య సేవలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అమర్చే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మొదలుపెట్టలేదు. భవన నిర్మాణం చేపట్టిన కంపెనీ ప్రతినిధులు గత డిసెంబర్లో సంబంధిత శాఖ మంత్రితో సమావేశమైన తర్వాత పనుల్లో కొంచెం వేగం కనిపించింది. ఆ తర్వాత నెలరోజుల్లోనే మళ్లీ పాత పరిస్థితి నెలకొన్నది. మరో ఆరు నెలలు ముమ్మరంగా పనులు కొనసాగినా భవన నిర్మాణం, యంత్రాలు, పరికరాల బిగింపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడందు.
హెల్త్ సిటీగా అభివృద్ధికి పక్కా ప్రణాళిక
వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేసింది. రాష్ట్రంలో ఏకైక హెల్త్ యూనివర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేసింది. పేదలకు అత్యాధునిక కార్పొరేట్ వైద్యం అందించేందుకు 24 అంతస్తుల తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చే సింది. రూ. 1116 కోట్లతో 2500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. 2021 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ ఈ పనులను ప్రారంభించారు. భవన నిర్మాణం, సర్వీసుల కోసం రూ.884 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.107 కోట్లు, ఇతర ట్యాక్సులకు రూ.125 కోట్ల చొప్పున కేటాయించారు.
రోగులు, వారి సహాయకులు, డాక్ట ర్లు, వైద్య సిబ్బంది అవసరాలు, క్యాంటిన్, ఇతర వ సతుల కోసం భవన నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయగా, కరోనా తర్వాత నెలకొన్న పరిస్థితులతో నిర్మాణ ఖర్చులు పెరిగాయి. ఈ మేరకు అవసరమైన నిధుల కేటాయింపులను పెంచాలన్న అధికారుల ప్రతిపాదన మేరకు అప్పటి ప్రభుత్వం చర్య లు చేపట్టింది. 2023 నవంబర్ ఆఖరు వర కు పూర్తయ్యేలా కేసీఆర్ ప్రభుత్వం పని చేసింది. అ సెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పనులు నెమ్మదించగా, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పనులు ఆగుతూ, సాగుతున్నాయి. 2024 డిసెంబర్లోనే పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్ర భుత్వం పేర్కొన్నది. త్వరలోనే ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామని చెబుతున్నప్పటికీ పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.