హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 5 : తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1345 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్‌కుమార్ లోధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం యూనివర్సిటీ ఆర్ట్స్‌కాలేజీలో జరిగిన యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సమావేశంలో శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలన్నారు.
రెగ్యులరేషన్ ఆలస్యమైతే యూజీసీ 7వ వేతన ఒప్పందం ప్రకారం పే స్కేల్ బేసిక్ ప్లస్ డీఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దామెర భిక్షపతి, పుల్లా రమేష్, సతీష్, బ్రహ్మయ్య, సాయిచరణ్ పాల్గొన్నారు.