ఖమ్మం అర్బన్, మే 17 : ఎప్‌సెట్-26 ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్‌లతో విజయకేతనం ఎగురవేసినట్లు ఖమ్మం శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య ఆదివారం తెలిపారు. సాయిచరణ్-8, అక్షయ్గుణ 60, అక్షర 85, వర్ష 148, మణిశంకర్ 204, శ్రీనిధి 244, అశ్రిత 290, హాసిని 341వ ర్యాంక్‌లు సాధించినట్లు తెలిపారు.
500లోపు 11ర్యాంక్‌లు, వెయ్యిలోపు 25మంది ర్యాంక్‌లు, 2వేలలోపు 42మంది ర్యాంక్‌లు, 5వేల లోపు 108మంది ర్యాంక్‌లు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ మల్లెంపాటి సాయిగీతిక, డీజీఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, కృష్ణ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాష్, జి గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్స్ తదితరులు అభినందించారు.