TG Polycet | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 6 : టీజీ పాలిసెట్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు, 8న స్పాట్ అడ్మిషన్ (సీట్ల కేటాయింపు) జరగనున్నట్లు పేర్కొన్నారు. టీజీ పాలిసెట్-2025లో అర్హత పొందిన, పొందని విద్యార్థులు ఇద్దరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని, అభ్యర్థులు తప్పనిసరిగా తగిన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో వివిధ కేటగిరీలో 28 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఇక్కడ సీటు దొరకనివారు కేసముద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు పొందవచ్చని సూచించారు. (మిగిలిన సీట్లు వివరాలకు https://tgpolycet.nic.in లో తెలుసుకోవచ్చన్నారు. విద్యార్థులు 8న ఉదయం 10 గంటలలోపు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో తప్పనిసరిగా టీసీ, ఎస్సెస్సీ మెమో, స్టడీ, కుల సర్టిఫికేట్లు, ఆధార్, టీజీ పాలిసెట్-2025 ర్యాంక్ కార్డు(అర్హత పొందినవారికి మాత్రమే), ఇతర అవసరమైన ధ్రువపత్రాలతో తప్పకుండా హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.