కాజీపేట, జనవరి 31 : మహా కుంభమేళాను పురస్కరించుకొని ఫిబ్రవరిలో పలు అదనపు ప్రత్యే క రైళ్లను కాజీపేట స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిని బీదర్- దానాపూర్-చర్లపల్లి స్టేషన్ల మధ్య నడుపుతున్నామన్నారు. ఫిబ్రవరి 14న బీదర్ నుంచి 07111 నంబర్‌తో మధ్యాహ్నం 11.10 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది.
తిరిగి 07112 నంబర్‌తో దానాపూర్ నుంచి ఫిబ్రవరి 16 మ ధ్యాహ్నం 3.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. అలాగే 18, 20 తేదీల్లో 07077 నంబర్‌తో చర్లపల్లి నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు దానాపూర్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో 20, 24 తేదీల్లో 07078 నంబర్‌తో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి.