మహాదేవపూర్(కాళేశ్వరం ) మే 9: ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో మహేష్, ఆలయ సూపరిండెంట్ బుర్రి శ్రీనివాస్, లేతకారి రాజబాపు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు నగేష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేటలో మండలంలోని కొడువటూరు సిద్ధలగుట్ట దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కార్యనిర్వహణ అధికారి చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమశ్శివాయ, డైరెక్టర్ మంతపురి రాములు, దేవాలయ అర్చక సిబ్బంది భాను ప్రకాష్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, సదాశివుడు. మహాశివుడు పాల్గొన్నారు.