జనగామ రూరల్, ఏప్రిల్24 : బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు పల్లె పల్లెన ప్రజానీకం కదలి రావాలని జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బల్దే సిద్ధిలింగం తెలిపారు. గురువారం మండలంలోని ఓబుల్ కేశవాపూర్, పెద్ద రామ్ చర్ల, సిద్దంకి, ఎల్లంలా, పెంబర్తి గ్రామాల్లో జన సమీకరణ పై పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిలింగం మాట్లాడుతూ 25 ఏళ్ల ఈ రజతోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆగం చేసిందన్నారు.
ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించామని, సాధించిన తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి ఒక్కరి మనసుల్లో కేసీఆర్ గుడి కట్టుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ మన రోజులు రావాలంటే కేసీఆర్ పాలన కోసం పోరాటం చేయక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా విభాగం అధ్యక్షురాలు చిన్నబోయిన రేఖ, మాజీ సర్పంచ్ ఎర్ర సుజాత, గ్రామ శాఖ అధ్యక్షులు మడిపల్లి సుధాకర్ గౌడ్, రవి, పరశురాములు, చిన్నబోయిన నర్సయ్య, నాయకులు పుప్పాల మల్లయ్య, కరుణాకర్, మడిపల్లి శ్రీనివాస్, కావిడే నగేష్, గట్టు దామోదర్, సతీష్, బీదనీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.