బచ్చన్నపేట ఏప్రిల్ 11 : కొనుగోలు కేంద్రాలకే రైతులు ధాన్యం తీసుకురావాలని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నల్ల నాగుల శ్వేత అన్నారు. శుక్రవారం మండలంలోని బచ్చన్నపేట, నారాయణపూర్, బసిరెడ్డిపల్లి. ఆలింపుర్, చిన్న రామంచర్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుక కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి రైతు దళారులను ఆశ్రయించకుండా కేంద్రాలకే ధాన్యం తరలించాలన్నారు.
నిర్వాహకులు ధాన్యాన్ని వెంట వెంటనే మిళ్లర్లకు తరలించాలన్నారు. అదేవిధంగా ధాన్యం డబ్బులు సైతం వెంటనే రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జంగిటి విద్యానాథ్, ఎద్దు హరీష్, మసూద్, కర్ణాకర్ రెడ్డి, కర్ణాకర్, భాస్కర్, బైరయ్య, శ్రీనివాస్, నజీర్, రాములు, రవీందర్ రెడ్డి. కావ్య శ్రీరెడ్డి, బాపురెడ్డి, నారాయణరెడ్డి, మహిపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బాలగోన్ రాజు, ఎల్లయ్య, బాలరాజు, రమేష్, నరేష్, దేవి ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, సీసీలు విజయలక్ష్మి, సత్యనారాయణ, తిరుమలమ్మ, నవనీత, రమాదేవి, శైలజ, దీక్ష, లావణ్య. మంగ, బుచ్చిరాజు, కవిత, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.