ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్లె, పట్టణం బోనమెత్తింది. మహిళలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వచ్చి పోచమ్మకు బోనాలు సమర్పించారు. పలుచోట్ల ముత్యాలమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, రేణుకా ఎల్లమ్మలకు పూజలు చేశారు. బోనంతో పాటు పసుపు, కుంకుమ, చీరెలను అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, నృ త్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోవిందరావుపేట గ్రామంలోని పోచమ్మ గుడిలో మంత్రి సీతక్క పూజలు చేశారు. దర్దేపల్లిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దండమ్మె తల్లికి బోనం సమర్పించారు. – నమస్తే నెట్వర్క్, ఆగస్టు 11