నెక్కొండ ఏప్రిల్ 1: భారత వినియోగదారుల సమాఖ్య కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు. మూడు దశాబ్దాలుగా వినియోగదారుల ఉద్యమంతో మమేకమై వినియోగదారుల మండలిలో పౌర సరఫరాల విభాగానికి సంబంధించిన ప్రభుత్వ కమిటీల్లో శ్రవణ్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తు న్నారు.1994లో వినియోగదారుల సాధారణ కార్యకర్తగా మొదలైన శ్రవణ్ ప్రస్థానంలో నెక్కొండ వినియోగదారుల మండలిని ఏర్పాటు చేసి మండల, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పదేళ్లకు పైగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతీయ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు.
ప్రస్తుతం వినియోగదారుల మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రవణ్ కుమార్ కు జాతీయ నాయకత్వం సిసిఐలో చోటు కల్పించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ అడ్వైజరీ కమిటీ, ప్రైస్ మానిటరింగ్ కమిటీలలో పనిచేసిన శ్రవణ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నూతనంగా తనకు అప్పగించిన ఈ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని, తన నియామకానికి సహకరించిన సిసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, సీసీఐ పూర్వ అధ్యక్షులు మొగిలిచర్ల సుదర్శన్ లకు, తనను ఎంపిక చేసిన సిసిఐ చీఫ్ పాట్రన్ డాక్టర్ అనంత శర్మ, జాతీయ అధ్యక్షులు ప్రీతి పాండే, డైరెక్టర్ కైలాష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.