హోంబలే సినిమాలు అవేనట?
పానిండియా రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ప్రతిష్టాత్మక చిత్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మూడు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభాస్‌కు భారీ మొత్తంలో అడ్వాన్స్‌ను కూడా వారు అందించినట్టు ఓ వార్త కొన్నిరోజుల క్రితం మీడియాను షేక్ చేసింది.
పానిండియా రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ప్రతిష్టాత్మక చిత్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మూడు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభాస్‌కు భారీ మొత్తంలో అడ్వాన్స్‌ను కూడా వారు అందించినట్టు ఓ వార్త కొన్నిరోజుల క్రితం మీడియాను షేక్ చేసింది. అయితే, ఆ మూడు సినిమాలు ఏంటి? దర్శకులెవరు? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ మూడు సినిమాల్లో మొదటిది ‘సలార్2: సౌర్యాంగపర్వం’. ప్రభాస్‌తో హోంబలే వారే ‘సలార్’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా భారీ సక్సెస్ సాధించింది. ప్రభాస్‌తో వారు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ముందు నిర్మించే సినిమా ‘సలార్ 2’ అని తెలిసింది. ఇక రెండో సినిమా.. మలయాళంలో కిష్కింధకాండ, ఏకో చిత్రాలను తెరకెక్కించిన దింజిత్ అయ్యథాన్ దర్శకత్వంలో ఉంటుందట.
దీనికి సంబంధించిన కథను కూడా సదరు దర్శకుడు సిద్ధంచేశారట. అలాగే ‘అమరన్’ఫేం రాజ్‌కుమార్ పెరియసామి కూడా ఇటీవలే ప్రభాస్‌కి ఓ కథ వినిపించారట. దాదాపు ప్రభాస్‌తో హోంబలే నిర్మించే మూడు సినిమాలు ఇవే అవుతాయని వినికిడి. అయితే ప్రభాస్ మాత్రం ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. అవి పూర్తయితే తప్ప నెక్ట్స్ కమిట్మెంట్స్ గురించి ఆయన ఆలోచించలేరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- fauzi
- hombale films
- Kalki 2
- Prabhas
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

