శాయంపేట, అక్టోబర్ 28 : ఓ వైపు అతివృష్టితో తెల్ల బంగారం దిగుబడులు తగ్గిపోగా, మరోవైపు కూలీల కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనికితోడు కూలీ రేట్లు రెండింతలై పత్తి రైతుకు ఆర్థికంగా పెనుభారమైంది. రైతులు పత్తి ఏరించేందుకు దూర ప్రాంతాల నుంచి ఎక్కువ కూలీ చెల్లిస్తూ కూలీలను ఉద యం వాహనంలో తీసుకొచ్చి సాయం త్రం తిరిగి పంపిస్తున్నారు. ఈసారి తెల్లబంగారం సిరులు కురిపిస్తుందన్న ఆశతో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేశా రు. ఎడతెరిపిలేని వానలతో పూత, కాత రాలిపోగా, కనీసం ఎరువులు వేసే పరిస్థి తి లేకపోవడంతో పంట దిగుబడి తగ్గిం ది. కొద్ది రోజుల క్రితం వరకు రోజుకు రూ.300 కూలీ ఉండగా ప్రస్తుతం కొరత కారణంగా రూ.350 చెల్లించాల్సి వస్తున్నది. పైగా వాహనదారుడు ఒక్కో కూలీకి రూ. 50చొప్పున తీసుకుంటున్నాడు.
నా లుగేళ్ల క్రితం ఎకరాకు 20 క్వింటాళ్లున్న పత్తి దిగుబడి గతేడాది 5 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రస్తుతం మూడు క్వింటాళ్లకు చేరుకుందని రైతులు వాపోతున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుకు అనుగుణంగా దిగుబడి లేక అన్నదాతలు నష్టపోతున్నా రు. ఎకరా సాగుకు విత్తనాలు, కలుపు, ఎరువులు తదితర ఖర్చులు కలిసి రూ. 25వేల నుంచి రూ.30 వేల వరకు వ్య యమవుతున్నది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక పత్తిని ఇంట్లోనే నిల్వ చేస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు.
ఒక్కో కూలీకి రూ.350 చెల్లిస్తున్నా..
13 ఎకరాల్లో పత్తి సాగు చేశా. వర్షాలతో పంట దెబ్బతిన్నది. పూత, కాత సమయంలో రాలిపోయింది. చేతికొచ్చిన పత్తిని ఏరుదామంటే కూలీలు దొరుకుతలేరు. దీంతో రాజుపల్లి నుంచి 30 మందిని వాహనాల్లో తీసుకొచ్చిన. వీరికి రూ. 350 చొప్పున ఐదు రోజులకు చెల్లించాను. దిగుబడి ఎకరాకు 3 క్వింటాళ్లకు పడిపోయింది. మొత్తం రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పటికీ దిగుబడి లేక పెట్టుబడి రాలేదు. – నూనేటి ప్రకాశ్, పత్తి రైతు, మైలారం