పాలకుర్తి/దేవరుప్పుల : ఎన్నికలేవైనా బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పాలకుర్తి, దేవరుప్పులలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం పటాకులు కాల్చి స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నాయి. ఎర్రబెల్లికి మిఠాయి తినిపించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విజయానికి కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయ న ధన్యవాదాలు తెలిపారు. ఆనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వి నియోగానికి పాల్పడ్డారని, డబ్బులు విచ్చలవిడిగా పంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండి పడ్డారు.