ఐనవోలు : ఐనవోలు మల్లన్న ఆలయంలో(Kalyana Brahmotsavams,) శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మల్లికార్జునస్వామి వారి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు ఉదయం 8గంటలకు లకు సూర్యప్రభ వాహనసేవ, 10 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వరణ, దీక్షాధారణ, ఆఖండదీపస్థాపన, ఆస్తరాజార్చన బలిహరణ, సాయంత్రం 4 గంటలకు లకు మృత్సంగ్రహణ, అంకురార్పణ, అగ్నిమదన – అగ్నిప్రతిష్టాపన ధ్వజారోహణ బలిహరణ కార్యక్రమాలు నిర్వహించచారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎఐ శ్రీనివాస్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, అయినవోలు మధుకర్ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, నందనం మధు శర్మ, పాతర్లపాటి నరేష్ శర్మ, ఉప్పుల శ్రీనివాస్, దేవేందర్ ,సిబ్బంది పాల్గొన్నారు.