వరంగల్, జూన్ 19: ‘బీఆర్ఎస్ టికెట్‌పై కార్పొరేటర్‌గా గెలిస్తే మేయర్‌గా ఎన్నుకున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరినందున స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలి. బల్దియా బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత గుండు సుధారాణికి లేదు‘ అని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అన్నారు. ఈ మేరకు బుధవారం వారు కార్పొరేషన్లో కమిషనర్ అశ్విని తానాజీ వాకేడేను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ అధ్యక్ష తన బల్దియా బడ్జెట్ సమావేశం నిర్వహించాలని కమిషనర్‌ను కోరారు.
మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహిస్తే అడ్డుకునేలా బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే గత ఆరు నెలలుగా సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేయడంపై వారు గుర్రుగా ఉన్నారు. మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే దానిపై నిర్వహించిన సమావేశంలో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు సైతం హాజరైన విషయం తెలిసిందే. ఈ నేప థ్యంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ వాళ్లు మద్దతు ఇస్తే బడ్జెట్ సమావేశం రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి.