వరంగల్, సెప్టెంబర్ 22 : వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయి ని రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. తొలిరోజు అమ్మవా రు శైలపుత్రిక క్రమంలో, బాలాత్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నిత్యాహ్నికం, గణపతి పూజ, పూర్ణాభిషేకం నిర్వహించారు. భేరీపూజ నిర్వహించిన అనంతరం ధ్వ జారోహణం, కలశస్థాపన చేశారు. అనంతరం అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా అలంకరించా రు.
ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు అధ్వర్యంలో ప్రత్యేక పూజలందుకున్న అమ్మవారిని ఉద యం వృషభ, సాయంత్రం మృగ వాహనాలపై ఊరేగించారు. అంతకు ముందు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కుల రూపేణా బహూకరించిన బంగారు కిరీటం, ముక్కుపుడక, ఇతర నగలను బ్యాంకు నుంచి పోలీసు బందోబస్తు మధ్య ఆలయ అధికారులు తీసుకొచ్చి భద్రకాళీ అమ్మవారికి అలంకరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తు లు గంటల తరబడి క్యూలో నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అలయ ఈవో రామల సునీత, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ధర్మకర్తలు, మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.