హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1 : ఈ నెల 3, 4వ తేదీల్లో ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడల ఎంపిక పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహిస్తున్నట్లు అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ నరెడ్ల శ్రీధర్ తెలిపారు. 3వ తేదీన క్రికెట్, నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, లాన్ టెన్నీస్, క్యారమ్, సెపక్తక్రా, స్కాష్, స్కేటింగ్, 4న ఖోఖో సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఫిజికల్ డైరెక్టర్స్ వెల్లడించారు. క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 98488 76765 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.