హనుమకొండ, సెప్టెంబర్ 02 : విద్యారంగ సమస్యలను పరిష్కరించని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగిపోవాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ డిమాండ్ చేసారు. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కలెక్టర్ కార్యాలయంను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేసారు.
పోలీసులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, మెస్, కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, బిరెడ్డి, జస్వంత్, అనూష, జిల్లా సహాయ కార్యదర్శి పరిమళ, బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు మడికొండ ప్రశాంత్, చెన్నూరి సాయికుమార్, ఎండీ ఇస్మాయిల్, సన్ని, పవన్ కుమార్, అరుణ్ కుమార్, నిఖిల్, మహేష్, భాను, రవళి, అనూష, రాధిక, మమత, ప్రవళిక, సుమతి, సుమ, విద్యార్థులు పాల్గొన్నారు.