హనుమకొండ, నవంబర్ 5 : హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నూతనంగా ప్రారంభించనున్న స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతికి బుధవారం సెలక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే క్రీడాపాఠశాల సెలక్షన్స్కోసం మొదట బాలురుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలోనే హైదరాబాద్‌లోని హకింపేట స్పోర్ట్స్స్కూల్లో రాష్ర్టస్థాయి సెలక్షన్స్జరిగాయని, ఇందులో ఎంపికైనవారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించామని హనుమకొండ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోత్ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ సెలక్షన్స్రెండు రోజులపాటు జరుగుతాయని, మొదటిరోజు తెలంగాణ వ్యాప్తంగా 27 మంది క్రీడాకారులు హాజరయ్యారని, వారి సర్టిఫికెట్స్వెరిఫికేషన్ నిర్వహించామని చెప్పారు. గురువారం మిగతా వారికి అలాగే బాలికలకు కూడా వెరిఫికేషన్ జరుగుతాయని అశోక్‌కుమార్ తెలిపారు. ఈ సెలక్షన్స్‌కు హైదరాబాద్ నుంచి సాట్ అబ్జర్వర్‌గా ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ రవికుమార్ హాజరయ్యారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.