నల్లబెల్లి, మార్చి 20 : పరీక్షా కేంద్రాల(Examination centres) వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్ఐ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నందున నల్లబెల్లి మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల తోపాటు కారుణ్య జ్యోతి పాఠశాల పరీక్ష కేంద్రాలను ఎస్సై పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది పరీక్షలు జరుగుతున్న సమయంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మండల కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశిస్తూ ఆయా జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులకు ప్రత్యేక నోటీసులు జారీ చేశారు.
అలాగే పరీక్ష రాసే విద్యార్థులు ఒక్కడికి లోనవ్వకుండా నిర్భయంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. ఎంఈఓ అనురాధ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను పురస్కరించుకొని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాలలో 354 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది బాలురు 170 మంది బాలికలు పరీక్షలకు హాజరవుతారని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులు ఎలాంటి కాపీయింగ్ కు పాల్పడకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేగాక విద్యార్థుల తల్లిదండ్రులు గాని బంధువులు గాని పరీక్ష కేంద్రాల వద్ద భూమి కూడడం లాంటి కార్యక్రమాలకు చేపట్టకుండా విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె సూచించారు