WARANGAL | కరీమాబాద్, మార్చి 29 : ప్రతీ విద్యార్థి జ్ఞాన తృష్టతో ఉన్నప్పుడే బావి భారత విజ్ఞాన శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతం కరీమాబాదులో గల న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్, ఓపెన్ హౌస్ కార్యక్రమాలను ప్రారంభించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ రవి మాట్లాడారు. విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత మాట్లాడుతూ ఓపెన్ హౌస్ కార్యక్రమం అనేది విద్యార్థుల మూర్తిమత్వ వికాసం అని, ఒక తెరిచిన పుస్తకం లా ప్రతి విషయాన్ని కులంకషంగా తెలుసుకోవడానికి ఆటపాటలతో సరదాగా విద్యార్జన జరుగుతుందని ఆమె అన్నారు. ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ శ్యాం సైన్స్ యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు.
వడుప్సా జిల్లా సెక్రటరీ బిల్లా రవి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చిన్నతనం నుండే అన్ని విషయాలలో ముందుండాలని అన్నారు. జిల్లా కోశాధికారి జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చదువుల ద్వారానే సాధ్యమవుతాయన్నారు. గిజు బాయ్ వ్యవస్థాపకులు మహేందర్ మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన అంశాన్ని వివిధ భాగాలుగా అర్థవంతంగా నేర్చుకోవడానికి గిజుబాయి సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 140 ఎగ్జిబిట్స్ ప్రదర్శన జరిగినలు పఠశాల కరస్పాండెంట్ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.