నెక్కొండ, డిసెంబర్ 17: యూనిఫాంతో స్కూల్ కు రా.. లేదంటే లీవ్ తీసుకొమ్మని అయ్యప్ప మాల ధరించిన నా లుగో తరగతి విద్యార్థికి ప్రిన్సిపాల్ చెప్పడంతో పాఠశాల డ్రెస్ ధరిస్తూ ముగిశాక అయ్యప్ప దు స్తులు ధరిస్తూ ఇబ్బందులు పడుతున్న వైనం నెక్కొండ మండలంలో వెలుగుచూ సింది. నెల రోజులుగా ఇలాగే జరుగగా మం గళవారం అయ్యప్ప మాల ధరించిన విద్యార్థి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సాయిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మోదుగుల రుద్రశేఖర్ తన కుమారుడు జ్యోతేందర్ను రెడ్లవాడ గ్రామంలోని ఆర్డీఎఫ్ పాఠశాలలో చదివిస్తున్నాడు.
తండ్రితోపాటు జ్యోతేందర్ అయ్యప్పమాల ధరించాడు. అయ్యప్ప డ్రెస్‌తో పాఠశాలకు హాజరయ్యేందుకు అనుమతించమని, మాలధారణ పూర్తయ్యేవరకు సెలవు తీసుకోవాలంటూ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విద్యార్థి పాఠశాల డ్రెస్‌కోడ్‌తో వెళ్తూ ముగిసిన తర్వాత అయ్యప్ప డ్రెస్‌తో ఉంటున్నాడు. ఈ విద్యార్థికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగు చూడడంతో మాలధారులు పాఠశాలకు చేరుకొని అయ్యప్ప డ్రెస్‌తో పాఠశాలకు వస్తే ఇబ్బందేమిటంటూ ప్రిన్సిపాల్ చేరాలును ప్రశ్నించారు. డ్రెస్‌కోడ్‌తో విద్యార్థి పాఠశాలకు నెలరోజులనుంచి హాజరవుతున్నారని, తల్లిదండ్రులు సైతం సమ్మతించారని ప్రిన్సిపాల్ చెప్పారు. తమ కుమారుడు అయ్యప్ప మాల ధరించి నెలరోజులవుతున్నదని, స్కూల్ డ్రెస్‌తోనే హాజరు కావాలని ప్రిన్సిపాల్ చెప్పినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.