హనుమకొండ చౌరస్తా : డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 26 వరకు నిర్వహించే సావిత్రి భాయిఫూలే ( Savitribai Phule ) 195వ జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్ ( Sravan ) పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమాన, ఉచిత, నాణ్యమైన విద్యనందించాలని, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సావిత్రిభాయిపూలే ఆలోచన విధానాన్ని, ఆశయాలను నేటి సమాజాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మహనీయుల ఆచరణను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉండే అసమానతలను పోగొట్టడానికి అందరు కృషి చేయాలని పిలుపినిచ్చారు. కార్యక్రమంలో డీఎస్ఏ విద్యార్థి సంఘ నాయకులు వెంకటేష్, సూర్య, శివ, శశి, చరణ్ పాల్గొన్నారు.