ఎల్కతుర్తి, ఏప్రిల్ 21 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల రైతుల సహకారం, వారి అనుమతితోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభను ని ర్వహిస్తున్నామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ వెల్లడించారు. సోమవారం సభా ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సోమవారం ఈ ప్రాం తానికి వచ్చి కాల్వలు పూడ్చివేస్తున్నారని, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.
రైతులతో మాట్లాడిన తర్వాతే 1200 ఎకరా ల స్థలాన్ని తీసుకొని, వారి సమక్షంలోనే పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వేదిక వద్ద పోస్తున్న రెడీమిక్స్ను సభ ముగిసిన తర్వాత తీసేసి యథాతథంగా రైతులకు అప్పగిస్తామన్నారు. సభకు ప్రజలు నడుచుకుంటూ వచ్చేలా కొన్ని ప్రాంతాల్లో మోసిన మొ రాన్ని కూడా తీసేస్తామన్నారు. ఏ ఒక్క రైతు నుంచి ఇబ్బంది తలెత్తలేదని, తాను స్థానికంగా ఉంటానని, వారి బాగోగులు తానే చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నడవడానికి కాల్వల వద్ద పోసిన మొరాన్ని సభ అనంతరం తొలగిస్తామన్నారు.
భూముల హద్దులు చెరిపేసినట్లు ఆరోపించారని, ముందుగానే సర్వేయర్‌తో హద్దులు తీసుకున్నామని, తర్వాత వాటిని యధావిధిగా పెడతామని హామీ ఇచ్చారు. సభకు అన్ని పార్టీలు, ప్రజలు, రైతుల సహకారం ఉందని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని సతీశ్‌కుమార్ తెలిపారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, నాయకులు తంగెడ మహేందర్, తంగెడ నగేశ్, గొల్లె మహేందర్, ఎల్తూరి స్వామి, మదన్మోహన్రావు, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, మంతుర్తి కొంరయ్య, జూపాక జడ్సన్, సాతూరి శంకర్ పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 21 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు దండులా కదిలిరావాలని మాజీ ఎమ్మెల్యే డాక్ట ర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండల అబ్జర్వర్, మాజి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఎర్రి రమణారెడ్డి అన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశానికి మండల అబ్జర్వర్, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ పండుగను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ మారపాక రవి, కూడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, కనకం గణేశ్, గుండె రంజిత్, చిట్టిబాబు, నాయకులు కట్ల రాజు, సాంబరాజు, అశోక్, జేమ్స్, యాదగిరి, ఎల్లయ్య, రాములు, శేఖర్ పాల్గొన్నారు.