హనుమకొండ, డిసెంబర్ 5 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు తప్పకుండా ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన వివరాల లెక్కలు చెప్పాల్సిందే. లేనిపక్షంలో అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి మొదలుకొని ప్రచారం, ఇతరత్రా కు పెట్టే ప్రతి పైసా ఖర్చును కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి.
ఎట్లాగూ ఓడిపోయామని అని లెక్కలు సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2011 జనా భా లెక్కల ప్రకారం సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వ్యయ పరిమితి విధించింది. అయితే పోటీ చేసినవారు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లో తప్ప కుండా వ్యయ వివరాలను ఈసీ నిబంధనల మేరకు జాగ్రత్తగా సమర్పించాల్సి ఉంటుంది.