కాళేశ్వరంలో 12 రోజులుగా కొనసాగుతున్న సరస్వతీ పుష్కరాల ఘట్టం సోమవారంతో పరిసమాప్తమైంది. చివరి రోజు కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని నదిలో పవిత్ర పుణ్య స్నానాలాచరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ఆలయం ఆధ్వర్యంలో అందజేసిన ఉచిత ప్రసాదాన్ని స్వీకరించారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దంపతులు, ప్రత్యేక సీఎస్ వికాస్‌రాజ్ దంపతులు, ధర్మపురి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీఐపీ ఘాట్‌లో పుషర స్నానమాచరించి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
– మహదేవపూర్ (కాళేశ్వరం), మే 26
కికిరిసిన త్రివేణి సంగమం
సరస్వతీ పుషరాలకు ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో త్రివేణి సంగమం, ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు కికిరిసిపోయాయి. దీంతో నదివైపు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో భక్తులు కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. ‘పాహిమాం సరస్వతీ మాతా.. మమ్ముల క్షేమంగా చూడు తల్లీ’ అంటూ భక్తులు వేడుకున్నారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం కోసం క్యూలో నిల్చున్న పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోగా రెస్క్యూ సిబ్బంది వారికి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడం, ఎండ తీవ్రంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.
పూర్ణాహుతితో..
సరస్వతీ పుషరాల నేపథ్యంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రజలకు సంపద, ఆరోగ్య వృద్ధి, పాడి పంటల శుభఫలితాల కోసం 12 రోజు ల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈవో మహేశ్ పాల్గొన్నారు. ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయ స్సు, వ్యవసాయోత్పత్తి అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతో 12 హోమాలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ వేదపండితులు విశేష పూజలు చేశారని శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. కాగా, చివరి రోజైన సోమవారం సాయంత్రం ఘాట్ వద్ద సరస్వతీ నవరత్న మాల హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య కాశీ పూజారులు నిర్వహించగా భక్తి పారవశ్యంతో ప్రజలు వీక్షించారు.
బస్సులు లేక పాట్లు..
పుషరాలకు వచ్చిన భక్తులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు లేక అనేక అవస్థలు పడ్డారు. ఆలయం నుంచి కాలినడకన తాతాలిక బస్టాండ్‌కు చేరుకొని బస్సుల కోసం గంటల సమ యం నిరీక్షించారు. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడం, కాళేశ్వరం-భూపాలపల్లి రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు నానా పాట్లు పడ్డారు.
బోటులో భక్తుల షికారు..
పుషరాలకు వచ్చిన భక్తులు నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం బోటులో తి రుగుతూ ఎంజాయ్ చేశారు. నదీ తీర అందాలను తమ కెమెరాల్లో బంధించడంతో పాటు సె ల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో త్రివేణి సంగమ తీ రం కాశీని తలపిస్తున్నదని భక్తులు అభిప్రాయపడ్డారు. ‘హరహర మహాదేవ.. శం భో శంకర’ అంటూ స్వామిని స్మరించుకున్నారు.
ప్రైవేట్ బస్సు దగ్ధం
పుషరాలకు భక్తులను తీసుకొని వచ్చి తిరిగి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు సోమవారం దగ్ధమైంది. సిరిసిల్ల నుంచి కాళేశ్వరానికి వచ్చిన భక్తులు పుషర స్నానమాచరించిన అనంతరం తమ స్వస్థలానికి వెళ్తుండగా మహదేవపూ ర్ మండలం బలిజపూర్ ప్రాంతంలో షార్ట్ స ర్క్యూట్‌తో ఒకసారిగా మంటలు చెలరేగడంతో బస్సు కాలిపోయింది. ఘటనా స్థలానికి రెండు అగ్ని మాపక యంత్రాలు చేరుకొని మంటలను ఆర్పి వేశాయి. వెంటనే అప్రమత్తమైన భక్తులు బస్సు దిగడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు.