వర్ధన్నపేట, ఏప్రిల్1: ఎమ్మె ల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. సన్నబి య్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఇసుక కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆకేరువాగు నుంచి ఇసుక రవాణా చేయకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవడం వల్ల తాము ఉపాధి కో ల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు.
కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే తమకే ఉపాధి లేకుండా చేసి న ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెబుతామని కూలీలు హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు. అనంతరం వరంగల్-ఖమ్మం జా తీయ రహదారిపై కూలీలు పెట్రోల్ సీసాలతో రాస్తారోకో చేశారు. తాము వాగు ఇసుక మీదనే ఆధారపడి దశాబ్దాలుగా జీవిస్తున్నామని, ఇప్పుడు అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమన్నది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగరాజు వస్తున్న సందర్భంగా నాయకులు ఇల్లంద జాతీయ రహదారిపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఫొటో లేదని ఒక వర్గం నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దూషించుకున్నారు. పార్టీ నాయకులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. కొంతకాలంగా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. స్థానికేతర నాయకులు వర్ధన్నపేటలో పెత్తనం చేస్తున్నారని సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు.