పోచమ్మమైదాన్, మార్చి 17 : వరంగల్ ఎనుమాముల వ్యవసా య మార్కెట్లో గురువారం ఎర్ర బంగారం(మిర్చి) ఆల్‌టైం రికార్డు ధర పలికింది. క్వింటాల్ దేశీ మిర్చిని రూ.44వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర అని వ్యాపారవర్గాలు తెలిపాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్రపల్లికి చెందిన సామినేని నాగేశ్వర్రావు 66 బస్తాల మిర్చి మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఇందిర ఎంటర్ప్రైజెస్ ద్వారా జితిన్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదు చేసింది. ఈ సీజన్లో మిర్చి అధిక ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.