నర్సంపేట/ నల్లబెల్లి, జులై 03 : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లోని పలు గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణానికి రూ.15.20 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు నియోజకవర్గం లోని పలు గ్రామాలలో రోడ్డు నిర్మాణ పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపనలు చేశారు. మహేశ్వరం నుంచి కోనాపురం రోడ్డుపై గురిజాల వద్ద 3.20 కోట్లు గురిజాల నుంచి కోనాపురం వరకు రూ.3.10 కోట్లు.. NH 365 రోడ్డు నుండి అడ్డబాట తండా వరకు కోటి రూపాయలతో బీటీ రోడ్డు, ఆర్ అండ్ బీ రోడ్డు నుండి చింతగడ్డ తండా వరకు రూ.60 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు,ఇటికాలపల్లి NH 365 రోడ్డు నుండి మేడిపల్లి వరకు రూ.6 కోట్లు
అలాగే నల్లబెల్లి మండలం లోని రుద్రగూడెం గ్రామం నుండి గుండ్లపహాడ్ వయా గాంధీ నగర్ వరకు రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు దొంతి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఆర్ అండ్ బీఈఈ ఇజ్జగిరి,డీఈ శ్రీకాంత్ రెడ్డి, ఏఈ రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.