హనుమకొండ, మార్చి 31: ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిల్వ లు భారీగా పెండింగ్‌లో ఉండడంతో అధికార యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా సీఎంఆర్ ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్లపై సీరియస్‌గా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ ఇవ్వకుండా హనుమకొండ జిల్లాలో బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు 12 మంది ఉన్నట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు గుర్తించారు. వీరివద్ద సుమారు రూ. 80.96 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం నిల్వలున్నట్లు ధ్రువీకరించారు.
ఇప్పటికే అనేకమార్లు గడు వు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ధాన్యం రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. ఈ మిల్లుల వివరాల ను సంబంధిత తహసీల్దార్లకు పంపించినట్లు సివిల్ సప్లయ్స్శాఖ అధికారులు తెలిపారు. ఈ చట్టం మి ల్లర్ల స్థిర, చరాస్తులను వేలం వేసి బకాయిలు రాబట్టుకునేలా పనిచేస్తుందని అంటున్నారు. తహసీల్దా ర్లు ఎగవేత మిల్లర్ల ఆస్తుల వివరాలు సేకరించే ప నిలో నిమగ్నమైనట్లు సమాచారం. కాగా, జిల్లాలో మిల్లులకు ఇచ్చిన వంద శాతం ధాన్యం విలువతోపాటు 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీతో కలి పి వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. మొ త్తం 12 మిల్లుల నుంచి రూ. 80,96,64,072 ఈ యాక్టు ద్వారా రాబట్టేందుకు అంచనా వేశారు.
మొదటి దశలో ఐదు మిల్లులపై..
హనమకొండ జిల్లాలో 12 మంది సీఎంఆర్ ఎగవేసినట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు గుర్తించారు. వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, అందులో మొదటి దశలో ఐదు రైస్ మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, హసన్‌పర్తిలోని బాలాజీ స్టేక్ రైస్ ఇండస్ట్రీ, మునిపల్లిలోని వసుధాలక్ష్మి ఇండస్ట్రీస్, అంజనీ ఇండస్ట్రీస్, లేపాక్షి ట్రేడర్స్, రాంపూర్‌లోని రుద్రమాంబ ఆగ్రో ఇండస్ట్రీస్, హిందుస్థాన్ ఆగ్రో ఇండస్ట్రీస్, పెంచికలపేటలోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్, నర్సక్కపల్లిలోని శ్రీ కార్తికేయ ఆగ్రో ఇండస్ట్రీస్, ముస్త్యాలపల్లిలోని నాగార్జున రైస్ మిల్లు, అగ్రంపాడ్లోని జాహ్నవి ట్రేడర్స్, నీరుకుళ్లలోని శ్రీ రాజరాజేశ్వర బీఆర్ఎం, ఒంటి మామిడి పల్లిలోని మహాలక్ష్మి బీఆర్ఎం మిల్లుల్లో సీఎంఆర్ పెండింగ్ ఉంది. అయితే మొదటి దశలో అంజనీ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీకార్తికేయ ఆగ్రో ఇండస్ట్రీ, నాగార్జున రైస్ మిల్లు, శ్రీ రాజరాజేశ్వర బీఆర్ఎం, మహాలక్ష్మి బీఆర్ఎం మిల్లులపై మొదటి దశలో ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఎన్ రవి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించినట్లు తెలిసింది.
బకాయి ఉన్న మిల్లర్లపై చర్యలు
సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లర్లపై కఠిన చ ర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో 2014 నుంచి ఇప్పటి వరకు 12 మంది రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలున్నట్లు గుర్తించాం. వీరి సమాచారం ఆయా తహసీల్దార్లకు పంపిం చాం. ఆర్ఆర్ చట్టం అమలు చేసి బకాయిలు రాబడతాం. బకాయి రైస్ మిల్లు యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. మొదటి దశలో ఐదు మిల్లులపై ఆర్ఆర్ చట్టం అమలు చేయనున్నాం. వాటికి సంబంధించిన చర, స్థిరాస్తుల వివరాలు సేకరించాలని ఆదేశించాం.
– అదనపు కలెక్టర్ ఎన్ రవి