హనుమకొండ రస్తా, నవంబర్ 17: హనుమకొండ బస్ స్టేషన్ నుంచి వరంగల్-1 డిపోకు చెందిన రాజధాని బస్సులను హనుమకొండ బస్ స్టేషన్ నుంచి శ్రీశైలం, తిరుపతి వయా హైదరాబాద్ వెళ్లే రాజధాని ఏసీ బస్సులను రీజనల్ మేనేజర్ డి.విజయభాను ప్రారంభించారు. రాజధాని ఏసీ బస్సులు ప్రతిరోజు ఉదయం 8:40 హనుమకొండ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి తిరుపతికి రాత్రి 11 గంటలకు చేరుకుంటుందని, అలాగే తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు హనుమకొండకు బయలుదేరుతుందన్నారు.
అలాగే రాజధాని ఏసీ శ్రీశైలం బస్సు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు హనుమకొండ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం చేరుకుంటుందని, ఈ సర్వీస్ వయా ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్ ద్వారా వెళ్తుందన్నారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 7:15 నిమిషాలకు హనుమకొండకు చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏసీ బస్సులలో ప్రయాణం చేయాలని ఆర్ఎం విజయభాను తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం (ఆపరేషన్స్) భానుకిరణ్, వరంగల్-1 డిపో మేనేజర్ అర్పిత, హనుమకొండ బస్ స్టేషన్ ఏటీఎం మల్లేశం, ఇతర సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.