రాష్ట్రంలో వ్యవసాయానికి అమలవుతున్న 24 గంటల ఉచిత కరంటుకు వ్యతిరేకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఊరూరా రేవంత్ దిష్టిబొమ్మలతో బీఆర్ఎస్ నాయకులు, రైతులు శవయాత్రలు నిర్వహించారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. రైతుల జోలికొస్తే పుట్టగతులుండవ్ అని హెచ్చరించారు.
నర్సంపేటరూరల్, జూలై 13: రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సంపేట మండలంలోని పలు విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట దహనం చేశారు. దాసరిపల్లి సబ్‌స్టేషన్ ఎదుట జడ్పీటీసీ కోమాండ్ల జయ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, క్లస్టర్ ఇన్చార్జీలు కోమాండ్ల గోపాల్‌రెడ్డి, వల్లాల కరుణాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, ఉప సర్పంచ్ మిట్టగడుపుల తిరుపతి, వల్గుబెల్లి ప్రతాప్‌రెడ్డి, మిట్టగడుపుల మల్ల య్య, చిలువేరు శ్రీనివాస్, యువ నాయకులు దామెర రాజ్‌కుమార్, పెండ్యాల మునేందర్, అల్లి రాజు, పెండ్యాల భిక్షపతి, వల్గుబెల్లి జయపాల్‌రెడ్డి, వల్గుబెల్లి మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు. దాసరిపల్లి జరిగిన కార్యక్రమంలో నాయకులు సంకటి గణపతిరెడ్డి, దాసరి బుచ్చిరెడ్డి, రాజు, కాలె రాజు, దాసరి రాజిరెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు. గురిజాల, జీజీఆర్పల్లిలోనూ రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్‌గౌడ్, నాయకులు గొడిశాల సదానందం, బండారి రమేశ్, ఎం రవి, అల్లి రవి, అల్లి రాజ్‌కుమార్, తుత్తూరు రమేశ్, వీరన్న, రవి, తిరుపతి, సాంబయ్య, వెంకన్న పాల్గొన్నారు.
కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది..
దుగ్గొండి: రైతులకు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మండలకేంద్రంతోపాటు అడవిరంగాపురం, రేఖంపల్లి విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట రైతులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం రైతులపై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. రేవంత్ వెంటనే రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుభందు సమితి మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, కంచకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, ఊరటి మహిపాల్‌రెడ్డి, వంగేటి అశోక్‌కుమార్, గుండెకారి రంగారవు, టీ రాజు, సర్పంచ్‌లు తిరుపతిరెడ్డి, యుగేంధర్, రజితా ఉమేశ్‌రెడ్డి, రమా విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎం రాజు, పిండి కుమారస్వామి, సోనీరతన్, ఆర్బీఎస్ కన్వీనర్లు, డైరెక్టర్లు, బీఆర్ఎస్ నేతలు, రైతులు పాల్గొన్నారు.
రైతాంగానికి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
ఖానాపురం/నెక్కొండ: వ్యవసాయ రంగానికి మనుగడ లేకుండా మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారిపేట, అశోక్‌నగర్ విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అన్నదాతలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు కోతలు ప్రారంభం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ రమేశ్‌నాయక్, వెంకన్న, బాలు, మౌలానా, రాజు, వల్లెపు శ్రీను పాల్గొన్నారు. అలాగే, నెక్కొండ మండలం అమీన్పేటలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పీఏసీఎస్ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మూడు గంటల విద్యుత్ అందిస్తే చాలంటూ రేవంత్ మాట్లాడడం అన్నదాతలను అష్టకష్టాలపాలు చేయడమేనన్నారు. కార్యక్రమంలో నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, రైతుబంధు సమితి జిల్లా నాయకుడు చల్లా చెన్నకేశవరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ డీ వీరభద్రయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, నాయకులు తాటిపెల్లి శివకుమార్, మాతంగి రాజు, ఖలీల్, కారింగుల సురేశ్, గరికపాటి కృష్ణారావు, తోట సాంబయ్య, ఈదునూరి యాకయ్య, కందిక మాణిక్యం, జువాజి మాణిక్యం, వనం యాకాంతం, జుట్టుకొండ వేణుగోపాల్ పాల్గొన్నారు.
దశదిన కర్మ చేసి నిరసన
నల్లబెల్లి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మలతో అంతిమ సంస్కారాలతోపాటు దశదిన కర్మలను మండలంలో పది రోజులపాటు కొనసాగించాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తూ పది రోజులపాటు దశదినకర్మలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రాంపూర్, మేడెపల్లి, ముచ్చింపుల, రేలకుంట, మూడుచెక్కలపల్లె, నారక్కపేటతోపాటు పలు గ్రామాల్లో గురువారం రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న రేవంత్‌రెడ్డి అవగాహనా రాహిత్యంతో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు గంటలే విద్యుత్ సరిపోతుందని మాట్లాడడం హేయమన్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీ బానోత్ సారంగపాణి, సర్పంచ్‌లు నానెబోయిన రాజారాం, చింతపట్ల సురేశ్రావు, రత్నాకర్‌రావు, బానోత్ పూల్‌సింగ్, జన్ను జయరావ్, ఎంపీటీసీ దేవుసింగ్, నాయకులు, క్లస్టర్ ఇన్చార్జీలు గందె శ్రీనివాస్‌గుప్తా, మాలోత్ ప్రతాప్‌సింగ్, ఇంగ్లీ శివాజీ, కొత్తపల్లి కోటిలింగాచారి, నాగంపెల్లి కిరణ్‌కుమార్, నాగేశ్వర్రావు, గుగులోత్ సారయ్య, కందికొండ రాములు, శంకర్, గుమ్మడి వేణు పాల్గొన్నారు.