రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్
ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. ఇందుకు తగ్గట్టుగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు.
- కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా డిప్యూటీ సీఎం ‘భట్టి’ వ్యవహారం
- స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్, జూన్ 10 :ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. ఇందుకు తగ్గట్టుగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. బుధవారం డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడారు. చిల్పూరు మండలం పల్లగుట్టలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన కార్యక్రమం చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పీచర, కొండాపూర్, కుర్చపల్లి, సాగరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్లు బీఆర్ఎస్ పాలనలో మంజూరయ్యాయని వివరించారు.
పీచర సబ్‌స్టేషన్ ఎప్పుడో ప్రారంభమైందన్నారు. తెలంగాణలో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, 65 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 72 లక్షల మెట్రిక్ టన్నులని డిప్యూటీ సీఎం భట్టి, 75 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని సీఎం రేవంత్‌రెడ్డి పొంతనలేకుండా చెబుతున్నారని రాజయ్య విమర్శించారు. నియోజకవర్గంలో 28 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఇక్కడి సమస్యలు తెలుసని చెబుతున్న భట్టికి గాడిద గుడ్డంత కూడా తెలియవని రాజయ్య ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రాహుల్‌గాంధీ తిరుగుతుంటే కాంగ్రెస్‌వి ఊసరవెల్లి రాజకీయాలని తెలుస్తుందన్నారు.
మంత్రిగా ఉన్నప్పుడు చేయని అభివృద్ధిని కడియం ఇప్పుడు చేస్తడా..?
టీటీపీ, బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా ఉండి అభివృద్ధి పనులు చేయని నీవు ఇప్పుడు ఎలా అభివృద్ధి చేస్తావని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియం, నేటి డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరు దొందుదొందేనని, వీరిద్దరూ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని పదేపదే చెబుతున్న కడియం శ్రీహరి మంగళవారం జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాక్షిగా, అధికారిక సభలో జై కాంగ్రెస్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడమే కాకుండా సభకు వచ్చిన వారిని కూడా నినాదాలు చేయమంటే స్పందన రాలేదని రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ప్రతి గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ సర్కారు వెంట పడుతామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్ తాటికొండ మధు, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

