హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 12: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 3 నుంచి 16 వరకు జరిగే పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్‌కి వినతిపత్రం అందజేశారు.
డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు జరగనున్న యూజీసీ నెట్, ఆర్ఆర్బీ గ్రూప్-డీ(జనవరి 15 వరకు) పరీక్షలు ఉన్నందువలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని విన్నవించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ, కార్యదర్శి జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షులు పనింద్ర, నాగరాజు, విజయ్, రవీందర్ రాథోడ్, హర్ష తదితరులు విద్యార్థి నాయకులు ఉన్నారు.