Irrigation Water | వేలేరు మండలానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే శ్రీహరికి వినతి
Irrigation Water | వరంగల్ జిల్లా వేలేరు మండలంలోని రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకులు, రైతులు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శనివారం వినతిపత్రం అందజేశారు.
వేలేరు: వరంగల్ జిల్లా వేలేరు మండలంలోని రైతులకు సాగునీరు ( Irrigation Water ) అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ( BRS ) మండల నాయకులు, రైతులు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( MLA Kadiyam Srihari ) కి శనివారం వినతిపత్రం అందజేశారు. మండలంలోని సాగు భూములకు గోదావరి జలాలు అందేలా పెండింగ్‌లో ఉన్న సాగునీటి పనులను వేగవంతం చేయాలని కోరారు.
వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం కోసం ఎత్తిపోతల పథకాలు, పైప్‌లైన్, కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వేలేరు మండలానికి గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు అందించి రెండు పంటలకు సాగునీరు కల్పిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నర్సింహారావు, సర్పంచ్ మరిజె అనిత, నాయకులు విజేందర్ రెడ్డి, జానీ, హరీఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

