 
                                                            మహబూబాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/ ఖిలావరంగల్ : ఎన్నికల సంఘం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,32,366 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో పురుషులు 7,47,836 మంది, మహిళలు 7,84,424 మంది, ఇతరులు 106 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సరికి మానుకోట పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,26,998 మంది ఉండగా, తుది ఓటర్ల జాబితా విడుదల అయ్యే సరికి 15,32,366 మంది ఉన్నారు. అంటే 5,368 మంది ఓటర్లు పెరిగారు. డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,22,906మంది, మహబూబాబాద్‌లో 2,58,850 మంది,నర్సంపేటలో 2,35,849 మంది, ములుగు 2,33,191 మంది, పినపాకలో 2,03,790 మంది, ఇల్లందులో 2,25,097 మంది, భద్రాచలంలో 1,52,683 మంది, ఇతరులు 106 మంది ఉన్నారు.
వరంగల్ నియోజకవర్గంలో..
వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 18,16,609 మంది ఓటర్లు ఉండగా, 8,92,676 మంది పురుషులు, 9,23,541 మంది మహిళలు, 392 మంది థర్డ్ జెండర్స్ ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు. స్టేషన్ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,52,618 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,24,669 మంది, మహిళలు 1,27,948, ఒకరు థర్డ్ జెండర్, పాలకుర్తి నియోజకవర్గంలో 2,54,807 మంది ఓటర్లలో 1,26,261 మంది పురుషులు, 1,28,533 మహిళలు, 13 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. పరకాల నియోజకవర్గంలో 2,22,266 మందిలో 1,08,159 మంది పురుషులు, 1,14,105 మంది మహిళలు, ఇద్దరు థర్డ్ జెండర్స్ ఉన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,81,798 మంది ఓటర్లలో 1,38,673 మంది పురుషులు, 1,43,111 మంది మహిళలు, 14 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2,56,507 మందిలో 1,24,733 మంది పురుషులు, 1,31,435 మంది మహిళలు, 339 మంది థర్డ్ జండర్స్ ఉన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,72,078 మందిలో 1,33,541 మంది పురుషులు, 1,38,520 మంది మహిళలు, 17 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 2,76,535 మందిలో 1,36,640 మంది పురుషులు, 1,39,889 మంది మహిళలు, ఆరుగురు థర్డ్ జెండర్స్ ఉన్నారు.
 
                            