దేవరుప్పుల, ఆగస్టు 20 : దేవాదుల ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లు, చెరువుల్లో నింపి రైతులకు ఇస్తరా? లేక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తరా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధి దేవరుప్పుల మండలానికి దేవాదుల నీరు వదలాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతృత్వంలో గురువారం ‘కాల్వ బాట’ పేర నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. నవాబుపేట రిజర్వాయర్ నుంచి దేవరుప్పుల మండలానికి ఎల్-2 కాల్వ ద్వారా నీరు రావాల్సి ఉండగా, ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో రైతులు వేసిన వరి పంట ఎండతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ యాత్రను చేపట్టింది. మండలంలోని ధరావత్ తండా నుంచి సింగరాజుపల్లి వరకు 6 కిలోమీటర్ల మేర కాల్వ వెంట ఎర్రబెల్లి పాదయాత్ర కొనసాగగా ఆయన వెంట వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, స్వచ్ఛందం గా రైతులు పాల్గొన్నారు. అన్నదాతలు తమ ట్రా క్టర్లతో తరలిరావడంతో కాల్వ పక్కన బా రులు తీరి కనిపించాయి.
పాదయాత్రలో ఎర్రబెల్లి ఎం డిన పంటలను పరిశీలిస్తూ, రైతుల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కాగా ధరావత్ తండాకు చెందిన కున్సోత్ పుల్యా అనే రైతు త నకున్న 4 ఎకరాల భూమిలో వేసిన పత్తి, వరి ఎండుతుండడంతో మరో బోరు వేస్తుండగా అత ని వద్దకు వెళ్లి మాట్లాడారు. ఈ రైతు ఇప్పటికే 15 బోర్లు వేయగా, ప్రస్తుతం మరొకటి వేసి నా నీరు పడకపోగా దుమ్ము రావడం ఆందోళనకు గురిచేసింది. సదరు రైతు ఎర్రబెల్లితో మాట్లాడు తూ ఇంత దారుణ పరిస్థితి మునుపెన్నడూ లేద ని, కాల్వ పక్కనే తన భూమి ఉందని, అందు లో నీరు పారితే బోర్లు పోస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సింగరాజుపల్లి వర కు ఆ యన కాల్వ బాట కొనసాగింది. అనంతరం సాగునీటికి పరిష్కారం కావాలని, అధికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పే వరకూ కదిలేదిలేదంటూ సింగరాజుపల్లి సెంటర్లో జాతీయ రహదారిపై ఎర్రబెల్లి భైఠాయించారు. ఎర్రటి ఎండలో గంటపాటు ఆందోళన కొనసాగగా ర హదారికి రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ నీళ్లుండి ఇవ్వలేని దుస్ధితిలో చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, నీటిపై కనీస అవగాహన లేని, రైతుల కష్టాలు తెలియని నా యకులు దాపురించారన్నారు. ఎంతసేపూ దోచుకోవడం.. దాచుకోవడంపైనే దృష్టి సారించారన్నారు. రేవంత్‌రెడ్డి కు టుంబం హైదరాబాద్‌లోని భూములను దో చుకుంటున్నదని, పార్టీ లో కుమ్ములాటలతోనే కాలం గడుస్తున్నదని, ప్రజలు, రైతులను ప ట్టించుకునే నాధుడే లే డన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మళ్లీ ము ఖ్యమంత్రి అవుతారని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. కాల్వ బాటలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల బీఆర్ఎస్ నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, గాంధీనాయ క్, తీగల దయాకర్, బస్వ మల్లేశం, రామకృష్ణారెడ్డి, ఏల సుందర్, లింగాల రమేశ్‌రెడ్డి, ఇప్ప పృథ్వీరెడ్డి, కొల్లూరు సోమయ్య, ధరావత్ రాం సింగ్, వినయ్‌రావు, నవీన్, నాగిరెడ్డి, శ్రీనివాస్‌రావు, మహేందర్, ధరావత్ మహేశ్ నాయక్, దేశగాని సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
రాస్తారోకో సమయంలో సాగునీటి శాఖ అధికారులతో ఎర్రబెల్లి ఫోన్లో మాట్లాడగా సెప్టెంబర్ 10 వరకు నీటి విడుదలకు అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆయన ఆలోపు పంటలు పూర్తిగా ఎండుతాయని, రెండు రోజుల్లో వదలకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎల్ నినో వంకతో ప్రభు త్వం ఆటలాడుతుందని, నీళ్లివ్వడం వల్ల కరెం టు, యూరియా ఇవ్వాల్సి వస్తుందని, పంటలు పండితే ప్రభుత్వం కొనుగోలు చేసి బోనస్ ఇ వ్వాల్సి ఉంటుందని, ఇవన్నీ తప్పాలంటే పొలా లు ఎండాలనేదే సర్కారు పాలసీ అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం మొదటి నుంచీ రైతులను చిన్న చూపుచూస్తున్నదని, రైతుబంధు ఎగ్గొట్టిందని, రైతుబీమాకు మంగళం పాడిందన్నారు. ప్రస్తుతం వేసుకున్న పంటలకు నీరివ్వకుండా రైతులను అరగోస పెడుతున్నదన్నారు.
కాగా, గంట పాటు రాస్తారోకో కొనసాగగా, పోలీసులు అక్కడికి చేరుకొని ఎర్రబెల్లిని అరెస్ట్ చేసేందుకు ఉపక్రమించారు. పార్టీ శ్రేణులు ఆయనకు రక్షణగా ఉండి పోలీసులతో ప్రతిఘటించారు. ఇలా అరగంట కొనసాగగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఎర్రటి ఎండలో చోటుచేసుకున్న తోపులాటలో ఎర్రబెల్లితో పాటు కొందరు నాయకులు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో శ్రేణులు ఎర్రబెల్లిని లేపగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి దేవరుప్పుల స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ఎర్రబెల్లి తలకు స్వల్ప గాయం కాగా దేవరుప్పులలో చికిత్స చేయించుకున్నారు.