హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. తెలంగాణభవన్‌లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రభుత్వ పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేసి.. రేవంత్ పాలనలో ఒక్కో రంగం ఎలా పతనమైందో వివరించారు. పదేండ్లలో రాష్ర్టాన్ని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్ది కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా కాంగ్రెస్ చేతిలో పెడితే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు పార్టీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై నిలదీశాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకు గులాబీ శ్రేణులు ఇంటింటికీ బాకీ కార్డులు పంపిణీ చేశాయి. 420 హామీలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి.
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జనగామ జిల్లా పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వికారాబాద్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఖమ్మం జడ్పీ సెంటర్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, కరీంనగర్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జగిత్యాలలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి, గజ్వేల్‌లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మెదక్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించి, ధర్నా చేశారు. భారీ ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా తొగుటలో ఓ మహిళ ఆటో దిగి బీఆర్ఎస్ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రేవంత్ అంటేనే మోసం, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు విస్మరించారని మండిపడింది. పింఛన్ల పెంపు ఏమైందని, కొత్త పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసీఆర్ పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగింది, ఇప్పు డు ఆ పరిస్థితులు లేవంది. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నది. స్వచ్ఛందంగా నిరసనలో పాల్గ్గొన్న మహిళ వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో ఫ్లెక్సీ వివాదం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణకు దారితీసింది. బుధవారం స్థానికంగా సంత కావడంతో ప్రజలకు వివరించేందుకు గ్రామపంచాయతీ ఎదురుగా సెంట్రల్ లైటింగ్‌కు భారీ ఫ్లెక్సీ కట్టారు. గమనించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గ్రామపంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీని తొలగించారు. కాంగ్రెస్ నాయకులు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సుబేదారి కలెక్టరేట్ వరకు 420 హామీలతో కూడిన బ్యానర్‌తో శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ హనుమకొండ అదాలత్ జంక్షన్‌కు చేరుకున్న క్రమంలో పోలీసులు పెద్దఎత్తున తరలివచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. హనుమకొండ ఏసీపీ నర్సింహారావు నేతృత్వంలో పోలీసు బలగాలు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వాహనంలో బలవంతంగా ఎక్కిస్తున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై దాస్యంతో పాటు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లో ఎక్కించి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతి తీసుకున్నప్పటికీ తమను అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు మండిపడ్డారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో భారీ ఫ్లెక్సీతో రాస్తారోకో చేస్తున్న మాజీ విప్ బాల్క సుమన్, బీఆర్ఎస్ శ్రేణులు

వనపర్తిలో జరిగిన బీఆర్ఎస్ సమరభేరిలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఖమ్మంలో రాస్తారోకో చేస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ శ్రేణులు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

జగిత్యాలలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ జెండా పట్టుకొని నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఆందోళన చేస్తున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ర్యాలీలో నినాదాలు చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

వికారాబాద్‌లో నిరసనలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెతుకు ఆనంద్

జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే సంజయ్