వరంగల్, జనవరి 18 : భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా రావు పద్మ మరోసారి నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను 2వ సారి జిల్లా ప్రెసిడెంట్‌గా పార్టీ గురువారం ప్రకటించింది. అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గంట రవికుమార్‌ను నియమించింది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా దశమంత్‌రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడిగా బలరాం ఎంపికయ్యారు. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధ్యక్షులను ప్రకటించలేదు.