జేఈఈ ఫలితాల్లో ఎస్సార్ ప్రభంజనం
దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్-2023లో హనుమకొండలోని ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో విజయాలను సాధించి, జాతీయస్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించినట్లు విద్యా సంస్థల చైర్మన్ ఎనుగందుల వరదారెడ్డి తెలిపారు.
- జాతీయ స్థాయిలో విద్యార్థులకు ర్యాంకులు
- విద్యాసంస్థల చైర్మన్ ఎనుగందుల వరదారెడ్డి
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 29: దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్-2023లో హనుమకొండలోని ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో విజయాలను సాధించి, జాతీయస్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించినట్లు విద్యా సంస్థల చైర్మన్ ఎనుగందుల వరదారెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ కాకాజీకాలనీలోని ఎస్సార్ కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ ప్రవేశపరీక్షలో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన బీ సమీత్ జాతీయస్థాయిలో రిజర్వేషన్ కేటగిరీలో 7వ ర్యాంకు, జీ సాత్విక్ రిజర్వేషన్ కేటగిరీలో 20వ ర్యాంకు, చవన్ అఖిల 22వ ర్యాంకు, కే శ్రీవర్షిత్ 34వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు. అలాగే, జూన్ 4న జరిగే జేఈఈ(అడ్వాన్స్)కు ఇప్పటి వరకు 2,786 పైగా విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు.
అలాగే, కొడారి కార్తీక్ 44వ ర్యాంకు, ధారావత్ సాయిధీరజ్ 48, బానోతు చరణ్ 92, బానోత్ నితీశ్ 109, షేక్ అబ్దుల్ సమీర్ 118, పృథ్వీరాజ్ తేజావత్ 167, బీ హర్తిక్ 167, సీ సోనిక 203, ఎండీ మొయినుద్దీన్ 215, ఐ నవీన్‌కుమార్ 232, పెండెం శ్రీకారి 322 ర్యాంకుతో పాటు ఇంకా 324, 343, 348, 357, 372, 403, 419, 458, 481, 497, 522, 528, 557, 563, 634, 651, 679, 728, 747, 770, 780, 784, 813, 814, 818, 848, 885, 924, 926, 951 ర్యాంకులు సాధించినట్లు వివరించారు. విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు అధ్యాపకులు అహర్నిశలు కృషి చేశారన్నారు. దేశంలోని ప్రముఖ నిట్‌లో విద్యార్థులకు సీట్లు వస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో విద్యార్థులను మరింత అత్యుత్తమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు.
ఐపీఎస్ అవుతా..
దేశంలోనే ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్‌లో 7వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. 6వ తరగతి నుంచి ఎస్సార్లోనే చదివా. మొదటి సంవత్సరం నుంచి టూ ప్లస్ వన్ చాలా ఉపయోగపడింది. రెండు తరగతుల తర్వాత ఒకటి డౌట్స్ క్లియర్ చేసుకునే విధంగా కాలేజీలో ఏర్పాటు చేయడం మంచి ర్యాంకులు సాధించేలా దోహదపడింది.రోజూ 14 గంటల పాటు చదివా. సివిల్స్ రాసి ఐపీఎస్ అవుతా.
– బీ సమిత్, పైడిపల్లి, వరంగల్
సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తా..
తన తల్లిదండ్రులు రవవి-సుమజ ప్రోత్సాహంతో 20వ ర్యాంకు సాధించా. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చు. ఎస్సార్ అధ్యాపకుల ప్రోత్సాహం, కావాల్సిన మెలుకువలు, గైడ్‌లైన్స్ అందించడంతో ర్యాంకు సాధించాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌కు మంచి ప్రాధాన్యం ఉంది. నాకు సాఫ్ట్వేర్ రంగంలోని రాణించాలని చాలా ఇష్టం. ఫేస్బుక్ సీఈవో కావాలనుంది.
– జీ సాత్విక్, 20వ ర్యాంకు
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
మాది కడప. తల్లిదండ్రులు చిన్మయలింగం-సురేఖ ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించా. ఎస్సార్ కాలేజీలో ప్రతి వారంరోజులకోసారి నిర్వహించే పరీక్షలు, టూ ప్లస్ వన్ చాలా ఉపయోగపడింది. 357 ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచించలేదు. నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన మంచి ర్యాంకు సాధించేందుకు తోడ్పడింది.
– టీ నర్మద, ఎస్సార్ విద్యార్థిని
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

