– ప్రారంభించిన కార్పొరేటర్ మునిగడప పద్మ
రుద్రంపూర్, జూలై 31 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ జాతీయ రహదారిపై అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కాల్వ పనులను 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొబ్బరికాయ కొట్టి కాల్వ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా కాలువలో నీళ్లు పోకుండా జాతీయ రహదారిపై బురద నీళ్లు ప్రవహిస్తున్న సమస్యకి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చొరవతో నేడు కాలువ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అలాగే కాలువ నిర్మాణం పనులు జరగడానికి సహకరించిన కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డిఈ నవీన్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ రహదారిపై ఉన్న పాతకాలపై నిర్మాణాలు చేపట్టి కాలువలో నీళ్ళు పోకుండా చేయడం ద్వారా మురికినీరంత జాతీయ రహదారిపై ప్రవహించడంతో దుర్గంధం వెదజల్లుతూ, వాహనదారులకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. కార్పొరేటర్ మునిగడప పద్మ కృషితో గత గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న ఆ సమస్యకు తెరపడుతున్నట్లు స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరు సుప్రియ, సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెంకటేశ్వర్లు, రామవరం ప్రముఖులు ప్రమోద్ అగర్వాల్, రమణ, ఉమాకాంత్, జలీల్, వ్యాపారస్తులు పాల్గొన్నారు.