గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. 17, 32, 33, 37, 43 డివిజన్లలో బుధవారం ఆమె అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు, శ్మశానవాటికలు, కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకుంటే బిల్లుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. అధికారులు పనులను పరిశీలించాలని సూచించారు.
– సుబేదారి, అక్టోబర్ 12
సుబేదారి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని 32వ డివిజన్ ఉర్సురోడ్డులో నిర్మిస్తున్న శ్మశానవాటిక పనులు, 33వ డివిజన్ కరీమాబాద్ కమ్యూనిటీహాల్, డివిజన్ వినాయక కాలనీ, తిమ్మాపూర్రోడ్డులోని పట్టణ ప్రకృతివనాలు, 17వ డివిజన్ దూపకుంట, స్తంభంపల్లి, 37వ డివిజన్ తూర్పు ఖిలావరంగల్‌లో అంతర్గత సీసీ, బీటీ రోడ్లను మున్సిపల్ అధికారులతో కమిషనర్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిం చాలని, లేనిపక్షంలో బిల్లుల్లో కోత విధించేలా చర్యలు తీసు కోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని, రెగ్యులర్‌గా పనులను పర్యవేక్షించాలని సూచించారు. కమిషనర్ వెంట బల్దియా ఈఈ శ్రీనివాస్‌రావు, డీఈలు నరేందర్, రవికిరణ్, హాబిబుద్దిన్, ముజమ్మిల్, ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ కియోస్క్ ప్రారంభం
స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లక్ష్య సాధనలో భాగంగా వరంగల్‌లోని మున్సిపల్ ప్రధాన కార్యాయంలో మెప్మా, బల్దియా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత స్పెషల్ కాంపెన్ 2.0 కియోస్క్‌ను బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 2వతేదీ నుంచి 31వ తేదీ వరకు మహిళా స్వయం సహాయక సంఘాల బృందాల నేతృత్వంలో వ్యర్థపదార్థాలు సేకరించి రీసైకిల్ చేయనున్నట్లు తెలిపారు. కాగితపు వ్యర్థాలు, పాత రికార్డులు, నివేదికలు, ఫైల్బోర్డులు, ప్యాకేజింగ్ వస్తువులు, కార్డ్‌బోర్డు పెట్టెలు సేకరించి రీసైక్లింగ్ చేయడం జరు గుతుందని వివరించారు. ఇందుకు ఆకుపచ్చ డబ్బాలో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడానికి, ఎరుపు డబ్బాలో పేపర్లు వేయడానికి, నీలం రంగు డబ్బాలో మెటల్ సంబంధిత ఉత్పత్తులను వేయడానికి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్రాజెక్టు అధికారి టీఎంసీ రమేశ్, సీవోలు ప్రవీణ్, శ్రీలత, సఫియా, రజిత పాల్గొన్నారు.