నర్మెట్ట, ఏప్రిల్ 23: పుట్టిన పిల్లలకు గంటలోపు ముర్రుపాలు అందించాలని ఇంచార్జి డీడబ్ల్యూవో రమాదేవి అన్నారు. మండలంలోని కన్నెబోయినగూడెంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు శ్రీమంతాలు, బాలింతలకు, తల్లులకు పోషక ఆహారం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. పుట్టిన పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు అందించాలని అన్నారు. ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు తల్లి పాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో తీసుకొనే ఆహారం పోషక విలువలతో కూడిందని పేర్కొన్నారు.
తల్లులు, బాలింతలు పోషక ఆహార లోపం లేకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మండల వైద్యాధికారి ఉదయ్ మాటాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పోహాక ఆహార లోపం ఉన్న పిల్లలను తప్పనిసరిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. పోషక ఆహారం విలువలు గల ఆహారాన్ని సమావేశంలో ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి అయిలయ్య, గ్రామ ప్రత్యేక అధికారి సుకన్య, ఆరోగ్య సూపర్వైజర్ భాగ్యమ్మ, ఐసిడిఎస్ సూపర్ వైజర్ సునీతా దేవి, పంచాయతీ కార్యదర్శి అనిల్, పాల్గొన్నారు.