శాయంపేట, మార్చి 26 : ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా దేశ ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రామచంద్రారెడ్డి అన్నారు. శాయంపేట మండలంలోని హుస్సేన్పల్లి గ్రామంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అనే అంశంపై బుధవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామచంద్ర రెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలో లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ఖర్చు తగ్గుతుందన్నారు.
ఈ విధానంతో ఆర్థికంగా వృద్ధి చెంది స్థిరమైన పాలన పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి కోవిందు కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు, బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ,యువ మోర్చా జిల్లా కార్యదర్శి శివ, మండల ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్, మండల ఉపాధ్యక్షుడు మోత్కూరు సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు కన్నెబోయిన రమేష్ పాల్గొన్నారు.