హనుమకొండ, నవంబర్ 6 : మేమెంతో మాకంత వాటాకై కేంద్ర ప్రభుత్వంపై పోరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీసీ జేఏసీరాష్ట్ర కన్వీనర్ కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీల మౌన దీక్ష కేయూ దూరవిద్య కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాల ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా చిర్ర రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ర్ట గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బీసీల 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్‌పై సంతకం పెట్టించి ఆ తర్వాత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ, తెలంగాణ బీసీ జాక్ వైస్ చైర్మన్ సంగాని మల్లేశ్వర్, జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వీరస్వామి, కేయూ బీసీ టీచర్స్అసోసియేషన్ గౌరవ ప్రధాన సలహాదారుడు శేషు, గడ్డం కృష్ణ, మల్లన్న, శ్రీకాంత్‌యాదవ్, సతీష్, సాదు రాజేష్, నాగయ్యగౌడ్, ఎర్రబొజ్జు రమేష్, తాళ్లపల్లి నరేష్, బొట్ల మనోహర్, సుధాకర్, సుమన్, అజయ్, రాజశేఖర్ శివకుమార్, శ్రీకాంత్‌గౌడ్, బీసీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.