బచ్చన్నపేట, జులై 18 : టీఎస్ జేయూ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన జర్నలిస్ట్ పోచంపల్లి రజిత ఎన్నికయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జనగామ జిల్లా అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్ ప్రతిపాదన మేరకు రాష్ట్ర అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆమె ఎన్నికను ప్రకటించారు. రజితతో పాటు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన జర్నలిస్ట్ తాటికొండ రజనిని ఎన్నుకున్నారు.
అలాగే టీఎస్ జెయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ తనపై నమ్మకం అప్పగించి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, అన్ని జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, జర్నలిస్ట్ నేతలు పాల్గొన్నారు.