రాజయ్య హౌస్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్లగుట్టలో విద్యుత్ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న భట్టిని అడ్డుకోవాలని సోమవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- డిప్యూటీ సీఎం భట్టి పర్యటనను అడ్డుకోవాలని పిలుపు
- తాటికొండను స్వగృహంలోనే నిర్బంధించిన పోలీసులు
స్టేషన్‌ఘన్‌పూర్, జూన్ 9: మాజీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్లగుట్టలో విద్యుత్ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న భట్టిని అడ్డుకోవాలని సోమవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని తన నివాసంలోనే తాటికొండతో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులను నిర్బంధించారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ భట్టి పర్యటనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన సబ్ స్టేషన్లను ఇప్పుడు ప్రారంభిస్తూ, తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేయ డం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ తాటికొండ మధు, మండల మాజీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, కనకం గణేశ్, గాదె రాజు, మారపల్ల ప్రసాద్, గుండె మల్లేశ్, ఆకారపు అశోక్ హౌస్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

